SDPT: జగదేవ్‌పూర్ మండలం కొత్తపేట గ్రామంలో సర్పంచ్ జ్యోతి మహేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం


