హైదరాబాద్: 28°C
తెలంగాణ

KPHBలో గోద్రెజ్ నిర్మాణ సంస్థ ఎదుట స్థానికుల ధర్నా

MDCL: కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్ నిర్మాణ పనుల్లో చేపడుతున్న బ్లాస్టింగ్‌తో శబ్ద, దుమ్ము కాలుష్యంతో పాటు భవనాలకు ప్రకంపనలు వస్తున్నాయని స్థానిక గేటెడ్ కమ్యూనిటీల వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 5 వేల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, భద్రతా ప్రమాణాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.