హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు'

JN: లంబాడీల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఓటుతో బుద్ధి చెబుతామని ఎల్‌హెచ్‌పీఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్ హెచ్చరించారు. రఘునాథపల్లి మండలంలోని కుసుంబాయి తండా, వేపలగడ్డ తండాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సేవాలాల్ మహారాజ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.