హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న 17 పశువుల పట్టివేత

BDK: చర్ల నుంచి కోదాడకు అక్రమంగా తరలిస్తున్న 17 పశువులను భద్రాచలం పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం బ్రిడ్జి చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన ఓ కంటైనర్‌ను ఆపి పరిశీలించారు. అందులో సుమారు 17 పశువులు ఉండటంతో వాహనాన్ని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.