GDWL: అయిజ మున్సిపాలిటీ 4వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు కోసం ప్రజలు ఉదయం నుంచే కేంద్రానికి చేరుకున్నారు. అయితే ఉదయం 10:30 గంటలైనా అధికారులు రాకపోవడంతో నమోదు ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో పనులకు వెళ్లకుండా వచ్చిన లబ్ధిదారులు కేంద్రం వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. జిల్లా అధికారులు స్పందించి నమోదు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
పనులు మానుకుని కేంద్రానికి జనం


