హైదరాబాద్: 28°C
తెలంగాణ

టోగర్‌పల్లి పార్కు టీజీఐఐసీ పరం

సంగారెడ్డి జిల్లా టోగర్‌పల్లి ఇండస్ట్రియల్ పార్కు నిర్వహణ కోసం గ్రామ పంచాయతీ అధికారాలను టీజీఐఐసీకి బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్ పేరుతో జీవో జారీ అయింది. టోగర్‌పల్లిలో 43.15 ఎకరాలు, అలియాబాద్‌లో కొంత భూమికి వర్తిస్తుంది. కొత్త ఐఏఎల్ఏలలో ఆదాయం టీజీఐఐసీ, పంచాయతీకి 65:35, ఇతర చోట్ల 50:50గా పంచుతారు.