హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'జ్యోతిబాపూలే ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలి'

మెదక్ జిల్లా రామాయంపేటలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గజవాడ లావణ్య నాగరాజు మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషి మరువలేనిదని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.