హైదరాబాద్: 28°C
తెలంగాణ

కక్కులూరులో 'ఖేత్ బచావో' అవగాహన

RR: షాబాద్ మండలం కక్కులూరులో సర్పంచ్ కలాల్ కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో రైతులకు ఖేత్ బచావో అభియాన్ అవగాహన కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర భూసార పరీక్షలు, సమతుల్య ఎరువుల వాడకం, సేంద్రియ సాగు, నీటి సంరక్షణపై వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరికి బదులు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు సాగుచేయాలని సూచించారు.