MLG: మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ములుగు మండల అధ్యక్షుడు ముశినేపల్లి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ భానోత్ రవిచందర్ పాల్గొన్నారు. బాలికల విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషిని కొనియాడారు.
తెలంగాణ
పూలే సేవలను స్మరించుకున్న కాంగ్రెస్ నాయకులు


