హైదరాబాద్: 28°C
తెలంగాణ

విషాదం.. కార్తీక 'దీపం' అంటుకుని యువతి మృతి

HYD: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముండే 18 ఏళ్ల సాయి వెంకట సింధు, రోడ్ నంబర్ 5లో ఎస్ఎస్ బొటీక్ నడుపుతోంది. ఈ నెల 12న రాత్రి షాప్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు గేటు వద్ద వెలిగించిన కార్తీక దీపం ఆమె చీరకు అంటుకుని మంటలు వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది.