NRPT: నారాయణపేట పట్టణంలోని పల్లె రుచులు హోటల్‌ను మున్సిపల్ ఛైర్పర్సన్ కొండ శ్వేతా సత్య యాదవ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది పరిశుభ్రత, ఆహార నాణ్యత, వంట నూనె, ఫ్రిజ్‌లు, ఆహార నిల్వలను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు. అనంతరం ప్రధాన రహదారులపై పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
తెలంగాణ
హోటల్‌లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఆకస్మిక తనిఖీ


