హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడాది గడిచినా అందని ఎన్నికల డిపాజిట్లు

WGL: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులకు డిపాజిట్ సొమ్ము ఇంకా అందకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,528 పంచాయతీలు, 13,438 వార్డులకు ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం 30 రోజుల్లోనే చెల్లించాల్సిన సొమ్ము ఏడాది కావస్తున్నా ఇవ్వకపోవడంతో అభ్యర్థులు అధికారులను నిలదీస్తున్నారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలన్నారు.