PDPL: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అపెండిక్స్ ఆపరేషన్ అనంతరం శ్రీలత అనే మహిళ మృతి చెందడం కలకలం రేపింది. కాపులపల్లికి చెందిన అజయ్ భార్య శ్రీలతకు శుక్రవారం వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ తర్వాత ఆమె మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే మరణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అపెండిక్స్ ఆపరేషన్ వికటించి మహిళ మృతి


