హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతల రోడ్డుతో వాహనదారులకు నరకయాతన

VKB: కోట్‌పల్లి మండల పరిధిలోని ఓగులాపూర్-రొంపల్లి-బంట్వారం రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణిస్తే వెన్నునొప్పుల బారిన పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, ప్రజలు పలుమార్లు ధర్నాలు చేసినా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.