BHNG: మోత్కూరులో మహాత్మ జ్యోతిరావు పూలే వర్థంతిని నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ట్టణంలోని పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్ నేత, పట్టణ అధ్యక్షుడు మత్స్యగిరి, నరసింహాచారి పాల్గొన్నారు.
తెలంగాణ
మోత్కూర్లో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి


