హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జ్యోతిబాపూలే ఆశయ సాధనకై పనిచేయాలి

ADB: ఆదిలాబాద్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అఖిల భారత మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ మాట్లాడుతూ.. సమాజంలోని మూఢనమ్మకాలు, కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త పూలే అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకై పనిచేయాలని పిలుపునిచ్చారు.