GDWL: జిల్లాలో నాటుసారా తయారీ, అక్రమ రవాణా కొనసాగుతున్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటిదొడ్డి, గట్టు మండలాల సరిహద్దు తండాల్లో తయారీ కేంద్రాలు ఉన్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తున్నా అక్రమ వ్యాపారం పూర్తిగా అరికట్టలేకపోతున్నారని అంటున్నారు. నాటుసారా తయారీ, రవాణాపై నిఘా పెంచామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ లింగాచారి తెలిపారు.
తెలంగాణ
సరిహద్దు తండాల్లో నాటుసారా దందా?


