హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ

GDWL: ​మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం శ్రీకారం చుట్టారు. రూ.10 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, మరో రూ.10 లక్షలతో మహిళా సమైక్య భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. గ్రామాల అభివృద్ధితోనే దేశం ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు.