హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమలాపురం మెయిన్ రోడ్డులో పైపులైన్ లీకేజీ

ములుగు: మంగపేట కమలాపురం గ్రామంలోని మెయిన్ రోడ్డుపై గ్రామపంచాయతీకి చెందిన తాగునీటి పైపులైన్ చాలాకాలంగా లీకేజీ అవుతోంది. దీంతో నీరు వృథాగా పోతుండటంతో పాటు రహదారిపై ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను గుర్తించి, వెంటనే పైపులైన్ లీకేజీకి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.