SRPT: జిల్లా కేంద్రం నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై సైడ్ డ్రెయిన్ నిర్మాణం కోసం తవ్విన మట్టిని రోడ్డుపైనే వదిలేశారు. 20 రోజులుగా మట్టి కుప్పలను తొలగించకపోవడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇదే దారిలో వెళ్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ
రోడ్డుపై మట్టి కుప్పలు.. వాహనదారులకు ప్రాణసంకటం!


