ADB: తలమడుగు మండలం కూచులపూర్ గ్రామంలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు పోరాడిన ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాగి దీపక్, రాములు, విజయ్, వామన్, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కూచులపూర్ గ్రామంలో జ్యోతిరావు పూలే వర్ధంతి


