హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాట్యంతో అలరిస్తున్న నిజామాబాద్ చిన్నారి

NZB: శాస్త్రీయ నృత్యంలో నిజామాబాద్‌ వినాయక్‌నగర్‌కు చెందిన సంధ్యారాణి, సంపత్‌కుమార్‌ దంపతుల కూతురు హయతి ప్రత్యేకతను చాటుకుంటోంది. 2021 నుంచి శాస్త్రీయ నృత్యంలో సాధన చేస్తోంది. వినాయక కౌతం, అన్నమయ్య సంకీర్తనలపై తన అభినయంతో అలరిస్తోంది. ఇప్పటివరకు 80కు పైగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇచ్చింది. పేద పిల్లలకు ఉచితంగా నాట్యశిక్షణ  ఇస్తానని చెబుతోంది.