SRD: నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనుక గల్లీలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. రోజూ 50–70 కోతులు ఇళ్లలోకి వచ్చి తలుపులు తెరుస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ కరుస్తున్నాయి. స్కూలు పిల్లలపైనా దాడులు చేస్తుండటంతో విద్యార్థులు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని, అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు.
తెలంగాణ
కోతుల బెడద..కాలనీవాసుల భయం


