KMR: బీబీపేట పెద్దచెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. విస్తీర్ణం పరంగా ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్ద చెరువుగా గుర్తింపు పొందింది. కానీ చెరువు అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందని స్థానికులు చెబుతున్నారు. కట్టను అభివృద్ధి చేసి, వాకింగ్ ట్రాక్, పార్కులు, పిల్లల ఆటస్థలం, కూర్చునేందుకు బెంచీలు, సుందరీకరణ పనులు చేపడితే పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని అంటున్నారు.
తెలంగాణ
పెద్ద చెరువు సుందరీకరణకు స్థానికుల డిమాండ్


