హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లవాగు ప్రాజెక్ట్ నుంచి యాసంగికి నీరు కష్టమే

SRD: సిర్గాపూర్ మండలం ​నల్లవాగు ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటలకు సాగునీరు విడుదల చేసేంత నీటి నిల్వలు ప్రస్తుతం లేవని ప్రాజెక్ట్ ఏఈ మల్లేశం స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో పరివాహక ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదై, ప్రాజెక్టులోకి తగినంత ఇన్‌ఫ్లో రాలేదని తెలిపారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ వివరాలు వెల్లడించారు.