హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైకల్య కార్డుల మంజూరులో అక్రమాల ఆరోపణలు

NLG: ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు మంజూరులో అక్రమాలు వెలుగు చూస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. వైకల్యం ఉన్నవారికి అందాల్సిన చేయూత పింఛన్లు అడ్డదారిలో అనర్హులకు అందుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హత లేని వారికి పింఛన్లు ఇప్పిస్తామని చెప్పి దళారులు ఒక్కోకార్డుకు రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకంటామని సంబంధిత అధికారి శేఖర్‌ రెడ్డి తెలిపారు.