ASF: కాగజ్నగర్ మండలం నజ్రుల్నగర్ విలేజ్ నం.10లో ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. 1971లో నిర్మించిన భవనం గోడలకు పగుళ్లు ఏర్పడి విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. 1 నుంచి 5 తరగతుల్లో 27 మంది విద్యార్థులు ఉండగా ఒక్క ఉపాధ్యాయుడే బోధిస్తున్నారు. అధికారులు స్పందించి నూతన భవనం నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం


