SRPT: సాధారణంగా ఐదారు అడుగులు పెరిగే జొన్న మొక్క ఏకంగా 20 అడుగుల ఎత్తుకు చేరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కోదాడలోని శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన గోపాల్రావు ఇంటి ఆవరణలో ఈ అరుదైన మొక్క పెరిగింది. సేంద్రియ ఎరువులు వాడుతూ, ప్రతిరోజూ నీరు పోయడం వల్లే ఇంత ఎత్తు పెరిగిందని ఆయన తెలిపారు. మొక్కను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
తెలంగాణ
20 అడుగులకు పెరిగిన జొన్న మొక్క


