హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి విడుదలపై కొనసాగుతున్న సందిగ్ధత

NLG: యాసంగి సాగుకు సిద్ధమవుతున్న శాలిగౌరారం ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో జలాశయ నీటిమట్టం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా, ప్రస్తుతం 18.5 అడుగుల మేర నీరు చేరింది. అయితే నీటి పొదుపుపై ప్రభుత్వ సూచనలతో విడుదలపై సందిగ్ధత నెలకొంది.