NRPT: ఒండ్రు మట్టి లోడుతో వెళ్తున్న ఓ టిప్పర్ లారీ మెట్టుగడ్డ వద్ద ఇవాళ ఉదయం అదుపుతప్పి బోల్తా పడింది. దామరగిద్ద నుంచి నారాయణపేటకు మట్టిని తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు కూడా వెల్లడికావాల్సి ఉంది. మట్టిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే అంశంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఒండ్రు మట్టి టిప్పర్ బోల్తా


