హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడవిపందిని ఢీకొని బైకర్ దుర్మరణం!

నిర్మల్ సమీపంలో ద్విచక్ర వాహనానికి అడవిపంది అడ్డురావడంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లోకేశ్వరం మండలం గడ్చిందా గ్రామానికి చెందిన మగ్గిడి సురేశ్ (39) శుక్రవారం భార్యను బాగాపూర్‌లోని అత్తగారింట్లో దింపి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో నగర సమీపంలో రోడ్డుపైకి వచ్చిన అడవిపందిని బైక్‌తో ఢీకొట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన మృతి చెందారు.