KMR: గత ఐదు రోజులుగా వర్షాలతో కాస్త తగ్గిన చలి ప్రభావం మళ్లీ పెరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో కామారెడ్డి జిల్లా ఎల్పుగొండ, రామలక్ష్మణపల్లిలో 15.7 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా చిమన్పల్లిలో 16.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు కొంత పెరగగా, తాజాగా చలి తీవ్రత పెరగడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.
తెలంగాణ
ఉమ్మడి జిల్లాలో మళ్లీ పెరుగుతున్న చలి


