హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మెదక్ బ్రిడ్జిపై నుంచి డివైడర్‌లోకి దూసుకెళ్లిన లారీ

MDK: పెద్దశంకరంపేటలో జాతీయ రహదారి-161పై వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బ్రిడ్జి డివైడర్ మధ్యలో ఇరుక్కుపోయింది. నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తూ డ్రైవర్ ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.