హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్వర్టు లేక గిరిజనుల అవస్థలు.. పట్టించుకునేదెవరు?

ASF: తిర్యాణి మండలంలోని గుండాల గ్రామపంచాయతీ అర్జుగూడ ఒర్రెపై కల్వర్టు లేకపోవడంతో స్థానిక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రానికి, గుండాల జలపాతానికి వెళ్లాలంటే ఒర్రె దాటి వెళ్లాల్సి ఉంటుంది. వర్షాకాలంలో నీటి ప్రవాహం పెరిగితే రాకపోకలు మరింత కష్టతరంగా మారుతున్నాయి. అధికారులు స్పందించి ఒర్రెపై కల్వర్టు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.