హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాసర ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

NRML: బాసర ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పనులకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. వివిధ శాఖలకు కేటాయించిన భూమి, రహదారులు, విద్యుత్, తాగునీటి వసతుల కల్పనను సమన్వయంతో వేగంగా పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ జరుపుతూ నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.