హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 30 నుంచి జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 3 రోజుల సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు DEO సచ్చిదానంద ప్రకటనలో తెలిపారు. ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఎగ్జిబిషన్ జరగనుంది. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలపై ఆసక్తి పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.