హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట నష్టం అంచనాలో కౌలు రైతులకూ న్యాయం

ADB: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టాన్ని వేగంగా అంచనా వేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. నమోదు ప్రక్రియలో కౌలు రైతులనూ తప్పనిసరిగా చేర్చాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులకు సూచించారు. అర్హులైన ఏ ఒక్క రైతుకూ పరిహారం అందకుండా మిగిలిపోకూడదని ఆయన స్పష్టం చేశారు.