హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గాభవాని ఆలయంలో సంకటహర చతుర్థి పూజ

KNR: నాగనూరులోని శ్రీ దుర్గాభవాని ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గణనాథుడికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. వినాయకుడి అనుగ్రహంతో విఘ్నాలు తొలగి, కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.