KMM: వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అమ్మవారి సన్నిధిలో ఉంచి, వివాహ వేడుకకు అమ్మవారి ఆశీస్సులు కలగాలని ప్రార్థించారు. ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
కనకదుర్గమ్మ సన్నిధిలో వైరా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


