నిర్మల్ భైంసా పట్టణంలోని ఏపీనగర్ మార్గంలో మండల పరిషత్తు కార్యాలయానికి వెళ్లే మూల మలుపు వద్ద కాలువపై నిర్మించిన కల్వర్టు శిథిలమై ఇరువైపులా గోడలు కూలిపోయాయి. వాహనాలు ఏమాత్రం అదుపుతప్పినా ప్రమాదానికి గురయ్యే ఆస్కారం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ హెచ్చరికగా బండరాళ్లు పెట్టారు. సంబంధిత అధికారులు వెంటనే కల్వర్టును పునర్నిర్మించాలని కోరారు.
తెలంగాణ
కల్వర్టు శిథిలం..ప్రమాదాలు జరిగే అవకాశం


