MBNR: జడ్చర్ల 14వ వార్డు నల్లకుంట మినీ ట్యాంక్‌బండ్‌లోకి మురుగునీరు చేరి నీరు కలుషితమవుతుండటంతో బీఆర్‌ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దుర్వాసన, దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మురుగునీరు చేరకుండా పైపును మూసివేసి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. స్పందించిన కమిషనర్ గిరీష్ మురుగునీటిని తొలగించి శుభ్రం చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
నల్లకుంట ట్యాంక్‌బండ్‌లో కలుషిత నీరు


