హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంచు దుప్పటి కప్పుకున్న ఏజెన్సీ

MLG: ఏటూరునాగారం ఏజెన్సీలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. తెల్లవారుజామున ప్రాంతమంతా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రహదారులు మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా కనిపించాయి. పొగమంచు తీవ్రతతో రహదారిపై వెళ్తున్న వాహనాలు సైతం స్పష్టంగా కనిపించలేదు. చలి, మంచు ప్రభావంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణిస్తున్నారు. ఉదయం వేళలో ఏజెన్సీ మంచు అందాలతో కనువిందు చేస్తోంది.