హైదరాబాద్: 28°C
తెలంగాణ

పలు కాలనీల్లో విద్యుత్ నిలిపివేత

సంగారెడ్డి: కొత్త విద్యుత్ సర్వీసుల పనుల కారణంగా ఇవాళ ఐనోల్, పటేల్ గూడ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు విడతలవారీగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు రూరల్ AE తెలిపారు. ఆర్కే నగర్, ఇంద్రేశం, సాయి వైభవ్, ఆనంద్ నగర్, నవ్య నగర్, బృందావన్, రాఘవేంద్ర, మధుర, కృష్ణా, మారుతి నగర్ తదితర కాలనీల ప్రజలు సహకరించాలని కోరారు.