JGL: రాయికల్ మండలం ఉప్పుమడుగు కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం ఎంపీడీవో బి.చిరంజీవి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడి పరీక్షల సన్నద్ధతను తెలుసుకున్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
తెలంగాణ
విద్యార్థినులు లక్ష్యంతో చదవాలి: ఎంపీడీవో


