PDPL: రామగిరి మండలం రత్నాపూర్, మేడిపల్లి శివారు భూముల రీ-సర్వేపై శనివారం గ్రామసభ నిర్వహించనున్నట్లు తహసీల్దార్ సుమన్ తెలిపారు. భూభారతిలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగే సభలో రీ-సర్వేకు సంబంధించిన అభ్యంతరాలు, పొరపాట్లను రైతులు రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
నేడు భూ రీ-సర్వేపై గ్రామసభ


