హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోల్ ఇండియా కబడ్డీ పోటీలకు సింగరేణి కార్మికుడు ఎంపిక

PDPL: సింగరేణి అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు కార్మికుడు రాజేష్ కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. కంపెనీ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో డిసెంబర్ 3 నుంచి 5 వరకు ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో జరిగే పోటీలకు సింగరేణి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆయనను జీఎంలు మధుసూదన్, నాగేశ్వరరావు తదితరులు అభినందించారు.