హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు తాజా నీటి నిల్వ వివరాలు

GDWL: జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 2.126 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో సున్నాగా ఉండగా, ఎడమ కాలువకు 560, కుడి కాలువకు 280 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తం అవుట్‌ఫ్లో 1,085 క్యూసెక్కులుగా కొనసాగుతోందని వెల్లడించారు.