హైదరాబాద్: 28°C
తెలంగాణ

జహీరాబాద్ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్

SRD: కలెక్టర్ ప్రతీక్ జైన్ జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలు, మౌలిక వసతులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతనంగా నిర్మించిన మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌ను త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.