హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో డ్రైవరు మృతి..!

BDK: బయ్యారం–మణుగూరు ప్రధాన రహదారి విజయనగరం సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వారపు సంతలో కూరగాయలు విక్రయించి అశ్వాపురం తిరిగి వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం.