WNP:పోగొట్టుకున్న 5 తులాల బంగారాన్ని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించిన పోలీసులు బాధితురాలు లలితమ్మకు తిరిగి అప్పగించారు. బస్టాండ్ వెనుక మెడికల్ షాప్ వద్ద పర్సు పోగొట్టుకున్నట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పర్సు తీసుకెళ్లిన వృద్ధురాలిని గుర్తించి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలుకు ఎస్సై హరిప్రసాద్ బంగారాన్ని అందించారు.
తెలంగాణ
సీసీ కెమెరాలతో ఐదు తులాల బంగారం స్వాధీనం


